దేశాన్ని పాలిస్తున్న మంత్రగత్తె : నరేంద్ర మోడీ ధ్వజం

శుక్రవారం, 11 ఏప్రియల్ 2014 (16:09 IST)
File
FILE
భారతదేశాన్ని గత దశాబ్దకాలంగా ఓ మంత్రగత్తె పాలిస్తోందని భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ పరోక్షంగా సోనియాగాంధీని విమర్శించారు. భారతీయ జనతాపార్టీ ఓ మాంత్రికుడిని తెచ్చిందని, ఆయన రాత్రికి రాత్రే అంతా మార్చేస్తానంటున్నాడని తనను ఉద్దేశించి సోనియా చేసిన వ్యాఖ్యలను ఆయన జంషెడ్ పూర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో మోడీ ప్రస్తావించారు.

కేంద్ర ప్రభుత్వం ఓ మంత్రెగత్తెను తెచ్చిందని, ఆమె గత పదేళ్లుగా ఈ దేశాన్ని పాలిస్తోందని, తత్ఫలితంగా ఉపాధి అవకాశాలు గల్లంతయ్యాయని, రైతుల కష్టాలు పెరిగాయని ఆయన అన్నారు. మంత్రగత్తె వల్ల దేశం పదేళ్లుగా దుస్థితిలో ఉందని, తనను తాను కాపాడుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ప్రజల జీవితాలను కష్టాల్లో పడేసిందని మోడీ మండిపడ్డారు.

తాను చాలా పేద కుటుంబంలో పుట్టానని, అందువల్ల పేదల కష్టాలు తనకు తెలుసునని మోడీ అన్నారు. నోట్లో గోల్డెన్ స్పూన్‌తో పుట్టిన వాళ్లకు పేదల కష్టాలు ఎలా తెలుస్తాయని పరోక్షంగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని సైతం ఆయన విమర్శలు గుప్పించారు.

వెబ్దునియా పై చదవండి