ఇప్పటి వరకు వేళ్లకే ఉన్న ఉంగరాలు కాని ఇప్పుడు కాస్తా ఇంకాస్త ముందుకు జరిగి గోళ్లపై హొయలుపోతున్నాయి. ప్రాచీన చైనాలో గోళ్ల సంరక్షణలో భాగంగా ఈ రింగ్ ట్రెండిండ్ మెుదలైంది. గోళ్ల మీద నక్షత్రాలు, కీ చెయిన్‌లలా ఉండే డిజైన్లు మెుదట వచ్చాయి. ఇటీవలి కాలంలో వీటిలో ఎన్నో విభిన్న డిజైన్స్ వెలుగు చూస్తున్నాయి. బంగారం, వెండి, స్టీల్‌తో తయారయ్యే ఈ నెయిల్ రింగ్స్‌లో స్వరోస్కి క్రిస్టల్స్ పొదగడంతో మరింత మెరుపులీనుతున్నాయి.