హైదరాబాద్: భారతీయ పాదరక్షల మార్కెట్‌లో వేగంగా అభివృద్ధి చెందుతున్న విభాగాన్ని లక్ష్యంగా చేసుకుంటూ, రేర్జ్ బై రేర్ రాబిట్ తమ మొదటి ఓపెన్ ఫుట్‌వేర్ కేటగిరీ అయిన ప్రీమియం లెదర్ స్లిప్-ఆన్స్ ఫర్ మెన్‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ ప్రకటనతో, ది హౌస్ ఆఫ్ రేర్ ఆలోచనాత్మకమైన డిజైన్, దినసరి వినియోగ వైవిధ్యం, వినియోగదారుల ఆధారిత నావీన్యానికి తమ నిబద్ధతను మరింతగా లోతుగా చేస్తోంది.
ప్రారంభ విడుదలలో బేజ్ (తేలికపాటి గోధుమరంగు), బోర్డో(గాఢ ఎరుపు), సిల్వర్ (వెండి రంగు), బ్లాక్, శాండ్ (ఇసుక రంగు), టాన్ (లేత కాఫీ రంగు) మరియు నేవీ(గాఢ నీలం) వంటి అనేక రంగుల్లో అందుబాటులో ఉన్న ఐదు ప్రత్యేక స్టైల్‌లు ఉంటాయి. ఇవి నిజమైన లెదరుతో తయారు చేయబడి, ప్రత్యేకంగా రూపొందించిన ఎర్గనామిక్ సోల్స్‌తో వస్తాయి. ఈ స్లిప్పర్లు రేర్జ్ కు ప్రత్యేకత కలిగిన డిజైన్ శైలిని, ప్రతి రోజు ఉపయోగించే క్యాజువల్ లైఫ్ స్టైల్ కు అవసరమైన సౌకర్యంతో సమ్మిళితంగా అందిస్తాయి.
“ప్రస్తుతం మార్కెట్‌లో ప్రీమియం స్లిప్-ఆన్స్ కు సంబంధించి స్పష్టమైన ఖాళీ ఉందని మేము గమనించాము, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో, అక్కడ మా బ్రాండ్‌కు ఇప్పటికే బలమైన గుర్తింపు ఉంది,” అని ది హౌస్ ఆఫ్ రేర్ యొక్క చీఫ్ బిజినెస్ ఆఫీసర్ పుల్కిత్ వర్మ తెలిపారు. “ఈ కొత్త విభాగం మా డిజైన్ డిఎన్ఏ మరియు రిటైల్ వృద్ధికి సహజంగా అనుసంధానమయ్యే వినియోగదారుల అవసరాలకు స్పందించేందుకు మాకు అవకాశం ఇస్తుంది.”
ఈ లాంచ్ సమయానికి అనుకూలంగా జరిగింది: గ్లోబల్ శాండల్స్ మార్కెట్ 2025 నాటికి యు ఎస్ డి 102.21 బిలియన్‌ను తాకనుందని అంచనా, భారత మార్కెట్ అదే సంవత్సరానికి యు ఎస్ డి 10.26 బిలియన్‌ను దాటి పోతుందని భావిస్తున్నారు. ఈ విభాగం పరిమాణం ఉన్నప్పటికీ, అధిక నాణ్యత గల మెటీరియల్స్‌తో పాటు దీర్ఘకాలిక సౌకర్యాన్ని కలిపిన ప్రీమియం ఎంపికలు ఇప్పటికీ పరిమితంగానే ఉన్నాయి. ఈ లోటును పూరించడానికి రేర్జ్ రూపం మరియు పనితీరు కలిసిన శ్రద్ధగల ఉత్పత్తిని అందించడానికి ముందుకొస్తోంది.
ఇన్-హౌస్‌లో రూపొందించిన ఈ ప్రతి జత ప్రత్యేకమైన బ్రాండెడ్ మోల్డ్స్, ఎర్గనామిక్ ఫుట్‌బెడ్స్ మరియు హై గ్రేడ్ లెదర్ అప్‌పర్స్ తో రూపొందించబడి ఉంటుంది. ఫ్యాషన్ హెయిరార్కీలో ఎక్కువగా పట్టించుకోబడని ఉత్పత్తికి ఇది ప్రీమియం భావాన్ని తీసుకొస్తుంది. ఈ స్లిప్పర్లు రోజువారీ విశ్రాంతి, వీకెండ్ షాపింగ్, వర్క్-ఫ్రం-హోం రోజుల నుంచి ప్రయాణాలకు సిద్ధంగా ఉండే వార్డ్రోబ్ వరకు అనేక సందర్భాలలో ఉపయోగించేందుకు రూపొందించబడ్డాయి.
రేర్జ్ విస్తరిస్తున్న ఫుట్‌వేర్ పోర్ట్‌ఫోలియోకు ఇది శాశ్వత విభాగంగా చేరనుంది. మొదట దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాలలో దీన్ని విడతలవారీగా విడుదల చేస్తారు, అక్కడ ఓపెన్ ఫుట్‌వేర్‌కు సాంస్కృతిక మరియు వాతావరణ సంబంధిత ప్రాముఖ్యత ఉంది. కాలక్రమేణా, ఈ కేటగిరీని బ్రాండ్ తన క్లోజ్డ్ ఫుట్‌వేర్ విభాగంతో సమానంగా పెంపొందించాలనే లక్ష్యంతో ఉంది. అదేవిధంగా, మల్టీ-బ్రాండ్ ఔట్లెట్లు మరియు ప్రత్యేక రిటైల్ ఫార్మాట్లలో తమ ఉనికిని బలోపేతం చేయాలన్నది బ్రాండ్ ఉద్దేశ్యం.
ఈ కేటగిరీ లాంచ్ ద్వారా రేర్జ్ యొక్క లక్ష్యం- ఆధునిక భారతీయ పురుషుల కోసం ప్రీమియం, బాగా తయారు చేసిన వార్డ్రోబ్ పరిష్కారాలను అందించడాన్ని మరింతగా బలపరిచింది. జీవనశైలి ప్రాధాన్యతలు మెల్లగా రిలాక్స్‌డ్ సిలుయెట్ల్‌లను మరియు ఫంక్షనల్ ఫ్యాషన్‌ను ఆశ్రయిస్తున్న వేళ, ఈ లెదర్ స్లిప్-ఆన్స్ డిజైన్, సౌకర్యం మరియు సంస్కృతి మిళితమయ్యే సమయంలో మార్కెట్‌లోకి వచ్చాయి. ఈ కలెక్షన్ ఇప్పుడు డబల్యూ డబల్యూ డబల్యూ డాట్ ది హౌస్ ఆఫ్ రేర్ డాట్ కామ్ వెబ్‌సైట్‌లో మరియు భారతదేశంలోని ఎన్నుకున్న రేర్ రాబిట్ స్టోర్లలో లభించుతుంది.