ప్రతి యువతి లేదా మహిళ తాము మరింత అందంగా కనిపించేందుకు అందమైన దుస్తులను, నగలను ధరిస్తుంటారు. అయితే, దుస్తులు, నగలు ధరించడమే కాకుండా వాటి ఎంపిక కూడా అత్యంత ముఖ్యమే. అందుకు ఎలాంటి ముఖానికి ఎటువంటి నగలు ఆకర్షణీయంగా ఉంటాయో తెలుసుకుందాం.
ప్రధానంగా గుండ్రటి ముఖం కలిగినవారు గుండ్రంగా ఉండే ఇయర్ రింగ్స్, చతురస్రాకారం వంటి రకరకాల ఆకారాల్లోని పొడవాటి చెవి రింగులు ధరిస్తే మరింత అందంగా కనిపిస్తారు. ఈ తరహా ముఖం కలిగినవారు రౌండ్ కట్ డైమండ్స్, జెమ్‌స్టోన్స్ ధరించకుండా ఉండడం ఉత్తమం. అలాగే గుండ్రటి ముఖం ఉన్నవారు పొడవాటి నెక్లెస్ దాని కింద మరొక గొలుసు వేసుకుంటే బాగుంటుంది.
ఎక్కువ పొడవుగా లేని కోలముఖం ఉన్నవారికి ఎటువంటి నెక్లెస్‌లైనా, చెవి రింగులైనా బాగుంటాయి. చతురస్రాకారంలో ఉండే ముఖం ఉన్నవారికి మెడ వరకే ఉండే చోకర్ స్టైల్ నెక్లెస్‌లు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. వీరు చిన్నవి, గుండ్రంగా ఉండే చెవి రింగులు అలాగే బటన్ రింగులు పెట్టుకుంటే అందంగా కనిపిస్తారు.