ఎగ్‌తో సూప్ ఎలా చేయాలో తెలుసా?

శనివారం, 1 సెప్టెంబరు 2018 (14:38 IST)
గుడ్డులో విటమిన్ హృదయ సంబంధిత వ్యాధుల నుండి కాపాడుతుంది. గుడ్డులో ప్రోటీన్స్, కెరోటినాయిడ్స్, విటమిన్ బి12, న్యూటియన్స్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. గుడ్డును తరుచుగా తీసుకుంటే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది. తద్వారా రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది. ఇటువంట గుడ్డుతో సూప్ ఎలా చేయాలో తెలుసుకుందాం.
 
కావలసిన పదార్థాలు:
వెజిటబుల్ స్టాక్ - 3 కప్పులు
కోడిగుడ్లు - 2
పచ్చిబఠానీలు - పావుకప్పు
పుట్టగొడుగులు - 3 
ఉప్పు - సరిపడా
సోయాసాస్ - 2 స్పూన్స్
 
తయారీ విధానం:
ముందుగా వెజిటబుల్ స్టాక్‌ను వేడిచేసి అందులో పుట్టగొడుగుల కట్‌చేసి వేసుకోవాలి. తరువాత బఠానీలు, సోయాసాస్, ఉప్పు వేసుకుని బాగా కాసేపటి వరకు మరిగించుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమంలో గిలకొట్టిన కోడిగుడ్లును కొద్దికొద్దిగా వేస్తూ బాగా కలుపుకుని పావుగంట పాటు ఉడికించుకోవాలి. అంతే వేడివేడి ఎగ్ సూప్ రెడీ. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు