గోంగూర అంటే ఇష్టపడని వారంటూ వుండరు. గోంగూరతో చట్నీనే కాకుండా ఇతర వంటకాలు కూడా చేయవచ్చును. ఇందులో క్యాల్షియం, ఇనుము, విటమిన్ ఎ, సి, రైబోఫ్లెవిన్, ఫోలిక్ యాసిడ్, పీచు పదార్థం అధికంగా ఉంటుంది. మరి గోంగూరతో చికెన్ కూర ఎలా చేయాలో తెలుసుకుందాం.
గోంగూర కట్టలు - 4
పచ్చిమిర్చి - 3
ఉప్పు - తగినంత
తయారీ విధానం:
ముందుగా చికెన్ ముక్కలలో నిమ్మరసం, ఉల్లిపాయ పేస్ట్, నెయ్యి, కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా కలుపుకుని 10 నిమిషాల పాటు అలానే ఉంచాలి. ఇప్పుడు బాణలిలో నూనెను పోసి వేడయ్యాక గోంగూర ఆకులు వేసుకుని బాగా వేయించుకుని చల్లారనివ్వాలి. చికెల్‌లో కొద్దిగా నీళ్లు చిలకరించి ఉడికించుకోవాలి.
తరువాత గోంగూరకి పచ్చిమిర్చి చేర్చి కచ్చాపచ్చాగా రుబ్బాలి. మరో బాణలిలో నెయ్యి లేదా నూనెను వేసుకుని కరివేపాకులు, జీలకర్ర వేసి వేయించాలి. తరువాత ఉడికించిన చికెన్ ముక్కలు, గరంమసాలా వేసి తడి లేకుండా వేయించుకోవాలి. చివరగా గోంగూర మిశ్రమాన్ని చికెన్ మిశ్రమంలో వేసుకుని కలుపుకోవాలి. అంతే.. గోంగూర చికెన్ రెడీ.