సంక్రాంతి సందడికి సిద్ధమవుతున్న పల్లె వాకిళ్లు

బుధవారం, 9 జనవరి 2008 (15:48 IST)
WD
ధనుర్మాసం ప్రారంభమైననాటి నుంచి పల్లెల్లో సంక్రాంతి సందడి మొదలవుతుంది. పల్లె వాకిళ్ల ముంగిట రకరకాల రంగులతో తీర్చిదిద్దిన రంగవల్లికలలో గొబ్బెమ్మలు దర్శనమిస్తాయి. పంటపొలాలు ధాన్యంతో నిండి ప్రకృతికి శోభనిస్తుంది. ఇక హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దులను ఆడిస్తూ సరదా చేసే గంగిరెద్దులవారితో ప్రతి పల్లె సంతోషంలో మునిగితేలుతుంది.

ధనుర్మాసంలో వచ్చే ఏకాదశినాడు విష్ణు మూర్తికి ప్రత్యేక పూజలు చేస్తారు. అదే విధంగా ప్రతి శనివారం సంవత్సరం పాటు ఈ క్రింది స్తోత్రాలను జపిస్తే శనిపీడ దరిచేరదు.

కోణస్థః పింగలో బభ్రుః కృష్ణో రౌద్రోంతకో యమః
శౌరః శనైశ్చరో మందః పిప్పలాదేన సంస్తుతః
నమస్తే కోణ సంస్థాయ పింగలాయ నమోస్తుతే
నమస్తే బభ్రు రూపాయ కృష్ణాయ చ నమోస్తుతే
నమస్తే రౌద్రదేహాయ నమస్తే చాంతకాయచ
నమస్తే యమ సంజ్ఞాయ నమస్తే సౌరయేవిభో
నమస్తే మంద సంజ్ఞాయ శనైశ్చర నమోస్తుతే
ప్రసాదం మమదేవేశ దీనస్య ప్రణతస్యచ

వెబ్దునియా పై చదవండి