తొలి ఏకాదశి జూలై 6, ఓం నమోః నారాయణాయ

సిహెచ్

శనివారం, 5 జులై 2025 (13:10 IST)
"ఓం నమోః నారాయణాయ, ఓం నమోః భగవతే వాసుదేవాయ" అనే రెండు మంత్రాలు చదువుకుంటూ పూజ ప్రారంభించాలి. బియ్యం పిండితో ప్రమిద చేసి అందులో 5 వత్తులతో దీపారాధన చేయాలి. ఐతే తులసి దళాలు లేకుండా విష్ణుమూర్తికి నైవేద్యం సమర్పించకూడదు. కనుక వాటిని సిద్ధం చేసుకోవాలి. ఐతే ఏకాదశి రోజు తులసి ఆకులు మాత్రం పొరపాటున కోయకూడదు. కాబట్టి ముందు రోజునే కోసి సిద్ధం చేసుకోవాలి. స్వామికి నైవేద్యంగా బెల్లం, పప్పు, ఎండు ద్రాక్ష, అరటితో పాటు బెల్లం పాయసంలో పచ్చ కర్పూరం కలిపి నైవేద్యంగా సమర్పించాలి. పచ్చకర్పూరంతో హారతి ఇవ్వాలి. 
 
ఏకాదశి వ్రతం పాటించేటప్పుడు పొరపాటున కూడా ఆహారంలో ముల్లంగి, బెండకాయ, ఆకుకూరలు, కాయధాన్యాలు, వెల్లుల్లి-ఉల్లిపాయలు మొదలైన వాటిని వాడరాదని పురాణ కథనం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు