ప్రతి నెల మొదటి తేదీన చమురు కంపెనీలు గ్యాస్ ధరలను పునసమీక్షిస్తుంటాయి. ఇందులోభాగంగా, ఆగస్టు ఒకటో తేదీన చేపట్టిన సమీక్షలో వాణిజ్య సిలిండర్ల వినియోగదారులకు ఉపశమనం కల్పించాయి. 19 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధరను చమురు సంస్థలు కొంత మేరకు తగ్గించాయి. ఈ ధర తగ్గింపు రూ.36 పైసలుగా ఉంది.
అయితే, హైదరాబాద్ నగరంలో మాత్రం ఈ తగ్గింపు రూ.44.50పైసలుగా ఉంది. ఫలితంగా భాగ్యనగరిలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.2,242 నుంచి రూ.2,197.50కు తగ్గింది. ఈ ధరలు నేటి నుంచే అమల్లోకి వస్తాయని చమురు సంస్థలు తెలిపాయి. అయితే 14.2 కేజీల గృహ వినియోగ సిలిండర్ ధరలో మాత్రం ఎలాంటి మార్పూ లేదు.