ఓ అభిమానిగా రామ్ నటిస్తున్నాడు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో పల్లెటూరి అందాలతోపాటు పరిపూర్ణమైన ప్రేమను ఆవిష్కరించామని దర్శకుడు తెలియజేస్తున్నారు. నువ్వుంటే చాలు.. పాటలో ప్రేయసి, ప్రియుల మధ్య జరిగే సన్నివేశాలు యూత్ ను అలరిస్తాయన్నారు.
రామ్ తరహాలో ఎనర్జిటిక్ ఎంటర్‌టైనర్‌తో రాబోతున్నారు. షూటింగ్ ముగింపు దశకు చేరువలో వున్న ఈ సినిమా నవంబర్ 28న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కాబోతుంది. ఉపేంద్ర ఆంధ్ర కింగ్ గా కనిపించనున్నారు. ఇది ఒకరకంగా అభిమాని బియోపిక్ గా ఉండబోతోంది. ఇంకా రావు రమేష్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, VTV గణేష్ కూడా కీలక పాత్రల్లో నటించారు.