1,441 ఎలక్ట్రిక్ బైకులను రీకాల్ చేసిన ఈ-స్కూటర్

ఆదివారం, 24 ఏప్రియల్ 2022 (13:18 IST)
దేశ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ బైకులు మార్కెట్‌లోకి వస్తున్నాయి. ఈ తరహా బైకులను ప్రతి కంపెనీ తయారు చేసి మార్కెట్‌లోకి విడుదల చేస్తుంది. అయితే, ఈ ఎలక్ట్రిక్ బైకుల్లో అమర్చిన బ్యాటరీలు పేలిపోతున్నాయి. ఈ పేలుడు సంఘటనలు వరుసగా జరుగుతున్నాయి. దీంతో ఈ-బైక్ ఉత్పత్తి కంపెనీల్లో ఒకటైన ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ కీలక నిర్ణయం తీసుకుంది. 
 
ఇటీవల పూణెలో జరిగిన ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని 1,441 యూనిట్ల ఈ-బైకులను రీకాల్ చేస్తున్నట్టు తెలిపింది. ఇటీవల ప్రమాదానికి గురైన ఈ-స్కూటర్‌తో పాటు ఆ బ్యాచ్‌లో తయారైన అన్ని బైకులను పరిశీలించాలని నిర్ణయించినట్టు తెలిపింది. 
 
అందుకే ఆ బైకులను వెనక్కి పిలిపిస్తున్నట్టు వివరించింది. ఆ స్కూటర్లలోని బ్యాటరీలు, థర్మల్ వ్యవస్థపై తమ సర్వీస్ ఇంజనీర్లు సమీక్ష నిర్వహిస్తారని తెలిపింది. భారత బ్యాటరీ ప్రమాణాలతో పాటు ఐరోపా ప్రమాణాలకు కూడా తమ స్కూటర్లకు అమర్చిన బ్యాటరీలు సరిపోతాయని తెలిపింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు