ఫ్యూచర్ రెడీ బీమా పథకంతో ఎస్‌బీఐ లైఫ్ – స్మార్ట్ షీల్డ్ ప్లస్

దేవీ

బుధవారం, 13 ఆగస్టు 2025 (19:19 IST)
SBI new policy
ప్రైవేట్ రంగ ఇన్సూరెన్స్ సంస్థల్లో ఒకటైన ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కొత్తగా - ఎస్‌బీఐ లైఫ్ - స్మార్ట్ షీల్డ్ ప్లస్ పథకాన్ని ఆవిష్కరించింది. ఇది ఇండివిడ్యువల్, నాన్-లింక్డ్, నాన్-పార్టిసిపేటింగ్, సిసలైన రిస్క్ లైఫ్ ఇన్సూరెన్స్ పథకం. నేటి వినియోగదారుల మారుతున్న అవసరాలను తీర్చే విధంగా ఇది రూపొందించబడింది. భవిష్యత్ అవసరాలకు కూడా అనువుగా ఉండే విధంగా ఎస్‌బీఐ లైఫ్ - స్మార్ట్ షీల్డ్ ప్లస్ అనేది జీవితంలోని వివిధ దశల్లో పెరిగే బాధ్యతలకు తగ్గట్లుగా, సరళంగా, ప్రొటెక్షన్‌ను పెంచుకోగలిగే విధంగా ఈ పాలసీ ఉంటుంది. 
 
దీర్ఘకాలిక భద్రత ప్రణాళికను మరింత అర్థవంతంగా, మరింత అందుబాటులోకి తెచ్చే విధంగా ఎస్‌బీఐ లైఫ్- స్మార్ట్ షీల్డ్ ప్లస్ రూపొందించబడింది. ఇది, లెవెల్ కవర్, ఇన్‌క్రీజింగ్ కవర్, లెవెల్ కవర్ విత్ ఫ్యూచర్ ప్రూఫింగ్ బెనిఫిట్ అనే మూడు ఆప్షన్లలో లభిస్తుంది. ఆర్థిక, వ్యక్తిగత ప్రస్థానాల్లో మారే అవసరాలకు అనుగుణంగా తమ లైఫ్ కవరేజీని మార్చుకోవడంలో పాలసీదార్లకు ఇవి సహాయకరంగా ఉంటాయి. ఇన్‌క్రీజింగ్ కవర్ బెనిఫిట్ వల్ల సమ్ అష్యూర్డ్ ఏటా 5 శాతం సింపుల్ రేటు చొప్పున పెరుగుతుంది. ఇలా సమ్ అష్యూర్డ్‌లో గరిష్టంగా 200 శాతం వరకు పెరుగుతుంది. లెవెల్ విత్ ఫ్యూచర్ ప్రూఫింగ్ బెనిఫిట్ ఆప్షన్ అనేది వివాహం, పిల్లల జననం, లేదా ఇంటి కొనుగోలులాంటి కీలక సందర్భాల్లో సమ్ అష్యూర్డ్‌ను, అదనంగా ఎలాంటి మెడికల్ అండర్‌రైటింగ్ అవసరం లేకుండా, పెంచుకునేందుకు పాలసీదార్లకి ఉపయోగపడుతుంది. ఏకమొత్తం లేదా వాయిదాల పద్ధతిలో లేదా రెండింటి మేళవింపుతో డెత్ బెనిఫిట్ పే అవుట్ ఆప్షన్లు కూడా ఉంటాయి. 
 
జీవిత భాగస్వామికి అదనంగా రూ. 25 లక్షలు లేదా పాలసీ తీసుకున్నప్పుడు లైఫ్ అష్యూర్డ్ ఎంచుకున్న సమ్ అష్యూర్డ్‌లో 50 శాతం మొత్తానికి (ఏది తక్కువైతే అది) అదనంగా లైఫ్ కవరేజీనిచ్చేలా బెటర్ హాఫ్ బెనిఫిట్‌లాంటి అదనపు ఫీచర్లు ఇందులో ఉన్నాయి. దీనితో పాలసీదారు కన్నుమూసినా, భాగస్వామికి ఆర్థిక భద్రత కొనసాగుతుంది. ఇలాంటి కేసుల్లో లైఫ్ అష్యూర్డ్‌ యొక్క డెత్ బెనిఫిట్ చెల్లించబడుతుంది. ఇక తదుపరి ప్రీమియంలేమీ చెల్లించనక్కర్లేకుండా, భాగస్వామికి కవరేజీ ప్రారంభమవుతుంది. 60 ఏళ్లు వచ్చే వరకు కొనసాగుతుంది. ప్రమాదవశాత్తూ మరణం, పాక్షికంగా శాశ్వత వైకల్యంలాంటి వాటికి కవరేజీని పొందేలా ఈ ప్రోడక్టులో ఎస్‌బీఐ లైఫ్-యాక్సిడెంట్ బెనిఫిట్ రైడర్లను కూడా పొందవచ్చు. తద్వారా అనూహ్య పరిస్థితుల్లో సమగ్ర ఆర్థిక భద్రతను పొందవచ్చు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు