చతురావృత్తి తర్పణం

శుక్రవారం, 14 సెప్టెంబరు 2007 (13:56 IST)
PTI PhotoPTI
సూర్యుడు నమస్కారప్రియుడు,
విష్టువు అలంకారప్రయుడ
గణపతి తర్పణప్రియుడు.

మహాగణపతికి ప్రియమైన చతురావృత్తి తర్పణం అనుష్ఠించడంవల్ల ఆయుష్షు, బుద్ది, యశస్సు, కవిత్వం, ఐశ్వర్యం, బలం, భుక్తి, ముక్తి, యుక్తి చేకూరుతాయి. గణపతి విగ్రహాన్ని నీటీలో నుంచి తెచ్చిన మట్టితో చేస్తాం గనుక మరల దానిని పత్రితో సహా నీటిలో కలపాలి. లోహ గణపతులకు నిమజ్జనం అవసరం ఉండదు. చతుర్థినాడు చేసేది వినాయక వ్రతకల్పం కాబట్టి మృత్తికతోనే స్వామిని ఆరాధించి వరసిద్ధిని పొందుతామన్నమాట.

రాగి లోహంతో వినాయకుణ్ణి ఆరాధిస్తే ఐశ్వర్యం వస్తుంది. వెండి లోహంతో స్వామిని ఆరాధిస్తే ఆయుర్దాయం లభిస్తుంది. స్వర్ణంతో గణేశ విగ్రహాన్ని తయారుచేసి ఆరాధిస్తే సంకల్పసిద్థి ఐశ్వర్యం కలుగుతాయి. శిలారూపంతో స్వామిని ఆరాధిస్తే జ్ఞానసిద్ధి కలుగుతుంది.

వివిధ ప్రాంతాలలో....

వివిధ దేశాలలో, వివిధ రూపాలతో పూజింపబడుతున్నాడు విఘ్నేశ్వరుడు. మధురైలో వ్యాఘ్రపాద గణేశునిగా దర్శనమిస్తాడు. మైసూరులో హోలీబీడు హూయసలేశ్వరాలయంలో విష్ణువర్థనుడు స్థాపించిన బంగారు ఛాయగల గణపతి సాక్షాత్కరిస్తాడు.

ముద్గల పురాణం పేర్కొన్న 32 గణపతుల బహుధా పూజనీయులు. వాటిలో 16 ముఖ్యమైన మూర్తులు. 1. బాలగణపతి 2. తరుణగణపతి 3. భక్తి గణపతి 4. వీరవిఘ్నేశ్వర 5. శక్తిగణపతి 6. ద్విజగణపతి 7. పింగళగణేశం 8. ఉచ్చిష్ఠగణపతి 9. విఘ్న గణపతి 10. క్షిప్రగణపతి 11. హేరంబ గణపతి 12. లక్ష్మీనాయకం 13. మహాగణపతి 14. భువనేశగణపతి 15. నృత్యగణపతి 16. ఊర్థ్వ గణపతి.

వేదాలలో, పురాణాలలో, తంత్రశాస్త్రంలో, సంహితలలో సదాబ్రహ్మ గణపతి తత్వం సుస్పష్టంగా విశదమవుతోంది. మెక్సికోలో ధాన్యదేవతగా, చైనాలో కాంగీతన్ అంటే బుద్ధి సమృద్ధిగా నిచ్చే దైవంగా వినాయకుణ్ణి ఆరాధిస్తున్నారు.

తలచితి నే గణనాథుని తలచితి నే విఘ్నపతిని దలచిన పనిగా
దలచితినే హేరంబుని దలచితి నా విఘ్నములను దొలగుట కొరకున్
అటుకులు కొబ్బరి పలుకులు చిటికెడు బెల్లమ్ము బ్రాలు చెరకు రసంబున్
నిటలాక్షునగ్రసుతునకు పటుతరముగా విందు చేసి ప్రార్థింతు మదిన్.

వెబ్దునియా పై చదవండి