నవగ్రహ మహర్థశలలో నవరత్న ధారణ

సోమవారం, 17 మార్చి 2014 (12:39 IST)
File
FILE
నవగ్రహాలకు సంబంధించి అంతర్థశలు ఉన్నట్టే గ్రహ మహర్థశ ఉంటుంది. అంతర్థశకు సంబంధించి ఆ కాలంలో వివిధ రత్నాలను ధరించిన ట్లే మహర్థశలోనూ రత్నాలను ధరిస్తే శుభం చేకూరుతుంది. రవి మహర్ధ్థశ ఆరేళ్లకాలంపాటు ఉంటుంది. ఈ మహర్థశ కాలంలో రవి జపం చేయించిన తర్వాత కెంపును వెండిలో ధరించాలి. దీనిని ఉంగరపు వేలికి మాత్రమే పెట్టుకోవాలి.

చంద్ర మహర్థశ పదేళ్ల కాలం ఉంటుంది. ఈ మహర్థ కాలంలో చంద్ర జపం చేయించి ముత్యాన్ని వెండిలో ధరించాలి. దీనిని ఉంగరపు వేలికి ధరించాలి. కుజ మహర్థశ ఏడేళ్ల కాలం ఉంటుంది. ఈ మహర్థశ కాలంలో కుజ జపం చేయించిన తర్వాత పగడాన్ని వెండిలో ఉంగరపు వేలికి ధరించాలి. బుధ మహర్థశ పదిహేడేళ్ల పాటు ఉంటుంది.

ఈ కాలంలో బుధ జపం చేయించిన తర్వాత జాతిపచ్చను బంగారముతో చేయించి చిటికెన వేలు పెట్టుకోవాలి. గురు మహర్థశ పదహారేళ్ల పాటు ఉంటుంది. ఈ మహర్థశ కాలంలో గురు జపం చేయించిన తర్వాత కనక పుష్యరాగం అనే రత్నాన్ని బంగారంతో చేయించి చూపుడు వేలికి పెట్టుకోవాలి. శుక్ర మహర్థశ 20 ఏళ్ల పాటు ఉంటుంది. శుక్ర జపం చేయించిన వజ్రాన్ని బంగారంలో చేసి ఉంగరపు వేలికి పెట్టుకోవాలి. శని మహర్థశ 19 యేళ్ల పాటు ఉంటుంది.

ఈ కాలంలో శని జపం చేయించిన నీలాన్ని వెండిలో మధ్య వేలికి ధరించాలి. రాహు మహర్థశ 18 యేళ్లపాటు ఉంటుంది. ఈ మహర్థశ కాలంలో రాహు జపం చేయించిన గోమేధికాన్ని వెండిలో ధరించాలి. ఈ ఆభరణాన్ని మధ్య వేలికి ధరించాలి. కేతువు మహర్థశ ఏడేళ్ల కాలం ఉంటుంది. కేతు జపం చేయించిన వైఢూర్యాన్ని వెండిలో మధ్య వేలికి పెట్టుకోవాలి.

వెబ్దునియా పై చదవండి