అనూరాధ 2వ పాదములో జన్మించిన వారైతే..!?

FILE
అనూరాధ నక్షత్రం రెండో పాదములో జన్మించిన జాతకులైతే పుట్టిన 14 సంవత్సరముల వరకు శని మహర్దశ కావున నీలమును వెండిలో మధ్య వేలుకు ధరించగలరు. 14 సంత్సరములు వయస్సు నుండి 31 సంవత్సరముల వరకు బుధ మహర్దశ కావున పచ్చను బంగారములో చిటికెన వేలుకు ధరించగలరు.

31 సంవత్సరముల నుంచి 38 సం.లు వరకు కేతు మహర్దశ కావున బంగారములో చిటికెన వేలుకు ధరించగలరు. 38-58 సంవత్సరాల వరకు ఈ జాతకులకు శుక్ర మహర్దశ కావున వజ్రమును బంగారములో ఉంగరపు వేలుకు ధరించగలరు. 58-64 సంవత్సరముల వరకు రవి మహర్దశ కావున కెంపును వెండిలో పొదిగించుకుని ఉంగరపు వేలుకు ధరించడం శ్రేయస్కరం.

64-74 సం.లు వరకు చంద్ర మహర్దశ కావున ముత్యమును వెండిలో పొదిగించుకుని ఉంగరపు వేలుకు ధరించగలరు. 74 సం.లు వయస్సు నుంచి 81 సంవత్సరముల వరకు కుజ మహర్దశ కావున పగడమును బంగారములో ఉంగరపు వేలుకు ధరించగలరని రత్నాల శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

వెబ్దునియా పై చదవండి