నవరత్నాలలో "ముత్యం" చంద్ర గ్రహానికి వర్తిస్తుందని జోతిష్కులు చెబుతున్నారు. కర్కాటకం చంద్రుని రాశి. రోహిణి, హస్త, శ్రవణం చంద్రుని నక్షత్రాలు. 2, 11, 20, 29 తేదీలు చంద్రుని దినాలుగా జోతిష్య శాస్త్రంలో పరిగణించబడుతున్నాయని వారు అంటున్నారు. కాబట్టి కర్కాటక రాశి, లగ్నాలలో, రోహిణి, హస్త, శ్రవణా నక్షత్రాలలో జన్మించిన వారు ముత్యం ధరించవచ్చునని రత్నాల శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. చంద్రుడు దుష్ట స్థానాలలో, దుర్బల స్థానాలలో వుండగా జన్మించిన వారు, చంద్ర దశ నడుస్తున్నవారు కూడా ముత్యాన్ని ధరించవచ్చునని రత్నాలశాస్త్రం అంటోంది.
సుఖ నిద్ర, జ్ఞాపక శక్తి, మానసిక ఎదుగుదల, వ్యాపారాభివృద్ధి, నిత్యావసరాలు, మందులు, పండ్ల తోటలు, మాతృ సౌఖ్యం, సంసార సుఖం, సత్వర వివాహానికి, హోటళ్ళు, విశ్రాంతి భవనాలు, నీటి పన్నులు, పానీయాలు, రస పదార్ధాలతో వ్యాపారం చేసే వారికి ముత్యం ధరించడం వల్ల శుభ ఫలితాలు కనిపిస్తాయి. పైత్యం, శ్వాస రోగాలు, మనో వ్యాధులు, చర్మ వ్యాధులు, ఉబ్బసం, ఉదర రోగం, స్త్రీల వ్యాధులు, నివారణకు ముత్యం ధరించడం శుభప్రదమని రత్నాల శాస్త్రం పేర్కొంటుంది.