నీలం రత్నాన్ని ధరిస్తే మానసిక క్షోభ తగ్గుతుందా?

గురువారం, 8 మే 2014 (16:47 IST)
File
FILE
వివిధ రకాల సమస్యల నుంచి విముక్తి పొందేందుకు తమ జాతక రాశికి సరిపడే రత్నాన్ని ధరించాలని రత్నాలశాస్త్ర నిపుణులు చెపుతుంటారు. ఈ నవరత్నాల్లో నీలరత్నాన్ని ధరిస్తే మానసికక్షోభ తగ్గిపోతుందని చెపుతున్నారు. దారిద్రబాధ, చోరబాధ, అస్థిరత్వము వంటివి కూడా నీలరత్న ధారణచే తొలగిపోతాయి.

అలాగే కెంపును ధరించడం ద్వారా అతిసారం, జ్వరం, అగ్నిరోగం, మనోవ్యసనం వంటి సమస్యలు దూరమవుతాయి. ఇంకా స్త్రీ సంబంధ వ్యాధి, పాండు, కామెర్లు, నీరసము తగ్గిపోవాలంటే ముత్యము ధరించాలి.

వ్రణములు, శస్త్రబాధ, మశూచి, శ్లేషకఫములు తగ్గిపోవాలంటే పగడాన్ని ధరించడం ఉత్తమం. ఉదర బాధ, కుష్టు, అగ్నిమాంద్యము, నొప్పులు, మర్మావయవబాధలు తొలగిపోవాలంటే జాతిపచ్చను ధరించడం చేయాలి.

దీర్ఘ శుక్లనష్టవ్యాధులు, కాళ్ళు మంటలు తగ్గిపోవాలంటే కనకపుష్యరాగాన్ని, మేహరోగము, మూత్ర రోగము, కామవికారములు, అతిముత్రము వంటివి తగ్గిపోవాలంటే వజ్రము ధరించడం శ్రేయస్కరము.

ఇంకా దురద, శతృపీడ, నీచసాంగత్యము, రహస్య వ్యాధులు దూరం కావాలంటే వైఢూర్యమును, క్రిమిరోగము, పిచ్చిపిశాచముల బాధల నుంచి విముక్తి కలగాలంటే గోమేధికాన్ని ధరించాలని రత్నాల శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి