మేష రాశివారు ఏ రత్నం ధరించాలి...? కలిగే ప్రయోజనాలేంటి?
బుధవారం, 9 ఏప్రియల్ 2014 (14:47 IST)
FILE
మేష రాశికి చెందిన వారు కెంపును ధరించాలి. కెంపును ధరించడం వల్ల జీవితంలో అభివృద్ధి చెందుతారు. డబ్బు విషయంలో విజయాన్ని సాధిస్తారు. ప్రేమ, మాధుర్యం కలగలిపిన జీవితం సొంతమవుతుంది. మేష రాశివారికి కోపం అధికంగా ఉంటుంది. అసహనం ప్రదర్శిస్తుంటారు. కనుక కెంపును ధరించినట్లయితే ఆ గుణాలు మాయమై ప్రశాంతంగా ఉంటారు. ఆదుర్దా లేకుండా హాయిగా ఉంటారు. ఒత్తిడికి గురయినప్పటికీ దానిని తేలికగా అధిగమిస్తారు. కనుక బంగారంతో చేసిన ఉంగరంలో పొదిగిన కెంపుల ఉంగరం ఎడమ, కుడి చేతులలో ఏదో ఒక చేతి ఉంగరపు వేలికి దీనిని ధరించాలి.