మేషరాశి రత్నధారణ: ఫలితాలు

బుధవారం, 20 ఆగస్టు 2008 (20:03 IST)
మేషరాశిని ఇంగ్లీషులో "ఏరిన్" అని వ్యవహరిస్తారని, ఈ రాశివారు సాహసవంతులుగా ఆత్మవిశ్వాసం కలవారుగా ఉంటారని రత్నశాస్త్రకారులు చెబుతున్నారు. ఈ రాశివారు ఎరుపు పగడం ధరించినట్లైతే కుజ దోషాలను నివారిస్తుందని, దృష్టిదోషాలతో పాటు భూతప్రేతాది భయాల నుంచి విముక్తి కలుగుతుందని రత్నశాస్త్రకారులు వెల్లడిస్తున్నారు.

ముట్టుకుంటే జారిపోతుందని, రక్తంలో ఉంచితే దాని పక్కల్లో రక్తం గడ్డకట్టడం పగడం ప్రత్యేకతని రత్న శాస్త్రకారులు చెబుతున్నారు. ఈ రత్నాన్ని మంగళవారం సూర్యోదయానికి మందుగా ధరించినట్లైతే మంచి ఫలితాలను ఇస్తాయని రత్నశాస్త్రకారులు తెలుపుతున్నారు.

ఈ పగడాన్ని రాగి, వెండిలోహములో పొదిగించుకుని కుడిచేతి ఉంగరపువేలుకు ధరించాలని, ముందుగా పాలు, గంగాజలంతో శుభ్ర పరచి ధరించుకోవాలని రత్నశాస్త్రకారులు తేలుపుతున్నారు.

వెబ్దునియా పై చదవండి