అస్తమిస్తున్న సూర్యడు ఎర్రగా ఎందుకు కనిపిస్తాడు?

శనివారం, 25 ఫిబ్రవరి 2012 (11:08 IST)
సాయంత్రం పూట ఎర్రగా ఉన్న సూర్యుడు కొండల్లోకి దిగిపోతున్నట్లు కనిపించే దృశ్యాన్ని సాధారణంగా అందరూ ఇష్టపడతారు. మరి సూర్యుడు అస్తమిస్తున్నపుడు ఎర్రగా ఎందుకు కనిపిస్తాడో తెలుసుకుందాం. సాయంత్రం వేళ సుర్యకిరణాలు ఏటవాలుగా పడుతుండటం వల్ల అవి చాలా దూరం ప్రయాణించవలసి ఉంటుంది.

అలా ప్రయాణించేటప్పుడు సూర్యకిరణాలలో ఎరుపురంగు తప్ప మిగిలిన అన్ని వర్ణాలు ధూళి కణాల వల్ల చెల్లా చెదురయిపోతాయి. కాంతిలో ఉండే మిగతావర్ణాల కంటే ఎరుపు రంగుకి తరం ధైర్ఘ్యం ఎక్కువు కావడమే దీనికి కారణం. దాంతో ఎక్కువ తరం ధైర్ఘ్యం వున్న ఎరుపు రంగు మాత్రమే మిగిలి ఉండటం వల్ల అస్తమిస్తున్న సూర్యుడు ఎర్రగా కనిపిస్తాడు.

వెబ్దునియా పై చదవండి