ఇలాంటి విషయాలు మీకు తెలుసా..?!

* పావురం యొక్క ఎముకలు దాని ఈకలకంటే తక్కువ బరువును కలిగి ఉంటాయి.

* గాడిద కళ్లు, దాని తలపై ఎంత చక్కగా అమరివుంటాయంటే... అది ఒకేసారి తన నాలుగు కాళ్ళను చూసుకోగలదు.

* అంతరిక్ష ధూళి కారణంగా మన భూమి బరువు రోజుకు 100 టన్నులు పెరుగుతోందట పిల్లలూ...!

* ఒక సాధారణ లెడ్ పెన్సిల్‌తో 35 మైళ్ల పొడవైన గీత గీయవచ్చు. అదే పెన్సిల్‌తో ఆంగ్ల భాషలోని 50 వేల పదాలను రాయవచ్చు.

* హమ్మింగ్ బర్డ్ సెకనుకు 90 సార్లు వంతున రెక్కలు టపటపలాడిస్తుంది. అంటే నిమిషానికి 5వేల సార్లు అన్నమాట.

* పవర్ ఫిష్ ఉమ్మిలాంటి ద్రవం (మ్యూకస్)తో పారదర్శకమైన ఒక సంచిని తయారు చేసుకుంటుంది. ఇలా సముద్రంలోని ఇతర కీటకాల బారి నుండి తనను తాను రక్షించుకుంటూ, సంతోషంగా నిద్రపోతుంది.

* మన శరీరంలో నాడీ వ్యవస్థలోని నాడులు... ఒక సెకనుకు 300 అడుగుల వంతున సందేశాలను అందిస్తాయి.

* ప్రపంచంలోకెల్లా అతి చిన్న మానవ ప్రాణి డచ్ దేశానికి చెందిన యువరాణి "పాలిన్". ఆమె తన 12 సంవత్సరాల వయసులో 23.2 అంగుళాలు ఎత్తు ఉండేది.

* ప్రపంచంలోని 2 లక్షల పూల రకాల్లో అతిచిన్న పుష్పం పేరు డక్ వీడ్. దీనిని మైక్రోస్కోప్ క్రింద మాత్రమే చూడగలం.

* పసిఫిక్ మహాసముద్రం వైశాల్యంలో చాలా పెద్దది. ఎంత పెద్దదంటే... భూమి ఉపరితలంలో 1/3వ వంతు ఆక్రమిస్తుంది. భూమి మీది ఖండాలన్నింటినీ ఒకచోట చేర్చినా, పసిఫిక్ మహాసముద్రమే దానికంటే పెద్దదిగా ఉంటుందట పిల్లలూ...!

వెబ్దునియా పై చదవండి