* రెండు భాషలు మాట్లాడగలిగే వ్యక్తిని "డైగ్లోట్" అని అంటారు.
* అమెరికన్లలో 16 శాతంమంది ఒంటిమీద ఎక్కడో ఒక చోట టాటూ వేయించుకున్నవారేనట.
* ప్రపంచంలో మాట్లాడే భాషల సంఖ్య 6,500. వెయ్యి అంతకంటే తక్కువమంది మాట్లాడే భాషల సంఖ్య 2 వేలు.
* ఖగోళ శాస్త్రజ్ఞుడు గెలీలియో గెలీలీ సమాధిని తవ్వినప్పుడు ఆయన కుడిచేతి ఉంగరం వేలి ఎముకను తొలగించి భద్రంగా దాచుకున్నాడట ఓ అభిమాని. అది ఇప్పుడు ఇటలీలోని ఒక మ్యూజియంలో ప్రదర్శనకు పెట్టారు.
* ప్రతి ఏటా చంద్రుడు భూమి నుంచి సుమారు ఒకటిన్నర అంగుళం దూరం జరుగుతున్నాడట.
* ఆల్‌ఫ్రెడ్ హిచ్‌కాక్ ప్రకారం... సస్పెన్స్‌కీ, సర్‌ఫ్రైజ్‌కీ తేడా ఉందట. అదేంటంటే... ఒక గదిలో ఉన్నట్లుండి బాంబు పేలితే అది సర్‌ఫ్రైజ్. బాంబు ఉందని తెలుసు, కానీ అది ఎప్పుడు పేలుతుందో తెలీని స్థితిని సస్పెన్స్ అంటారట.
* చరిత్రలో జనసంఖ్య పది లక్షలు దాటిన తొలి నగరం లండన్. 1811 నాటికే ఆ నగరంలో జనసంఖ్య ఒక మిలియన్ దాటిపోయిందట.