అరటి పండు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుందట!

శుక్రవారం, 27 మార్చి 2015 (17:40 IST)
ఆరోగ్యం కోసం ఖరీదైన పండ్లనే తీసుకోవాల్సిన పనిలేదు. చౌక ధరలో లభించే అరటి పండులో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో వున్నాయి. అరటి పండులో సుక్రోస్, ఫ్రుక్టోస్, గ్లూకోస్‌ను కలిగివున్న అరటి పండులో ఫైబర్ పుష్కలంగా ఉంది. రెండు అరటి పండ్లు తీసుకున్న ఒకటిన్నర గంటలోపే శరీరానికి కావలసిన ఎనర్జీ  లభిస్తుంది. అరటిపండు శరీరానికి శక్తినివ్వడంతో పాటు.. అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది. వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది.  
 
పిల్లలు మందంగా ఉంటే అరటిపండు దివ్యౌషధంగా పనిచేస్తుంది. అరటిపండులో పాలు తేనే కలిపి మిల్క్ షేక్ తీసుకుంటే శరీరానికి తగిన ఎనర్జీ లభిస్తుంది. అరటిపండులో సహజమైన వ్యాధి నిరోధక శక్తి, ఆమ్లాలు త్రేన్పులను నిరోధిస్తాయి. రోజు అరటి పండును తీసుకుంటే పేగు సంబంధిత వ్యాధులను దూరం చేసుకోవచ్చు. 
 
అరటి పండులో పొటాషియం పుష్కలంగా ఉండటం ద్వారా గుండె పనితీరును సక్రమంగా ఉంచడంతో పాటు ఆక్సిజన్‌ను మెదడుకు అందించి.. శరీరంలోని నీటి శాతాన్ని సమతుల్యంగా ఉంచుతుంది. తద్వారా గుండెపోటును నిరోధించవచ్చు. ఆహారం తీసుకున్న 3 గంటలకు తర్వాత అరటి పండు తీసుకుంటే రక్తంలోని గ్లూకోజ్ శాతం అధికమై తెల్లవార్లు నిద్రపోయే రోగానికి చెక్ పెట్టవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 

వెబ్దునియా పై చదవండి