స్లిమ్‌గా ఉండాలంటే.. ఇదిగోండి పోషకాహార ప్రణాళిక!

గురువారం, 2 అక్టోబరు 2014 (18:33 IST)
అలవాట్లలో, దైనందిన కార్యక్రమాల్లో మార్పులతో స్లిమ్‌గా, మానసిక ఉత్సాహంతో ఉండవచ్చు. అందుకోసం పోషకాహారం కూడా తీసుకోవాలి. అల్పాహారం ఉదయం వేళ తప్పకుండా తీసుకోవాలి. అల్పాహారం తీసుకోకపోతే స్థూలకాయం తప్పదు. 
 
భోజనం సమయానికి తీసుకోవాలి. ఆహారం తినడం మానేస్తే శరీరానికి శక్తి అందదు. కొవ్వు పేరుకుంటుంది. రోజుకు రెండుసార్లు స్నాక్స్, మూడు సార్లు భోజనం చేయడానికి వీలుగా ప్రణాళిక రూపొందించుకోవాలి. దీనివల్ల తరచూ ఆకలివేసి, చిరుతిండ్ల వైపునకు దృష్టి మరలదు.
 
భోజనాల మధ్య ఖాళీ ఉండేలా చూసుకోవాలి. కనీసం 3-5 గంటలు ఉండాలి. పనిలో ఆలస్యం అవుతుంటే ఆహారం తీసుకునే ప్లాన్‌లో ఇబ్బంది కలుగుతుంది, అందుచేత కొన్ని పదార్థాలు ప్యాక్‌చేసి సిద్ధంగా ఉంచుకుంటే ఈ ఇబ్బందిని అధిగమించవచ్చు. 
 
పదార్థాల తయారీని సులభతరం చేసుకోవాలి. పండ్లు, కూరగాయలు, కట్ చేసి ఉంచుకోవాలి. కట్ చేసుకుని రెడీగా ఉంచుకుంటే సలాడ్లు, కూరలు తయారుచేసుకోవడం సులభమవుతుంది. కుక్కర్, మైక్రో ఓవెన్లను ఎక్కువగా వాడుకుంటే త్వరగా పనులు పూర్తవుతాయి. 

వెబ్దునియా పై చదవండి