బీపీ ఉన్నవారు జీడిపప్పును తీసుకోవచ్చా?

బుధవారం, 25 ఫిబ్రవరి 2015 (17:01 IST)
గుండె ఆరోగ్యంగా ఉండాలా రోజూ జీడిపప్పు తీసుకోండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. గుండె ఆరోగ్యం ఇతర విత్తనాలతో పోలిస్తే జీడిపప్పులో తక్కువ శాతం కొవ్వు ఉంటుంది. అంతేకాకుండా, గుండె ఆరోగ్యాన్ని పెంపొందించే 'ఒలిక్ ఆసిడ్' కూడా ఇందులో ఉంటుంది.
 
కొవ్వు పదార్థాలను తక్కువగా మరియు యాంటీ-ఆక్సిడెంట్'లను కలిగి ఉండి గుండె సంబంధిత వ్యాధులకు దూరంగా ఉంచుతుంది. ముఖ్యంగా ట్రై గ్లిజరైడ్ అనే కంటెంట్ గుండె ఆరోగ్యానికి గ్రేట్‍గా సహాయపడుతుంది.
 
జీడిపప్పులోని పుష్కలమైనటువంటి మెగ్నీషియం వల్ల బ్లడ్ ప్రెజర్‍‌ను తగ్గిస్తుంది. ఇక రక్తపోటు(బీపి) ఉన్నవారు కూడా జీడిపప్పును తినేందుకు భయపడాల్సిన పనిలేదు. ఇందులో సోడియం శాతం తక్కువగానూ పొటాషియం నిల్వలు ఎక్కువగా ఉంటాయి.

వెబ్దునియా పై చదవండి