మధుమేహ వ్యాధిగ్రస్తులు పిస్తా తినవచ్చా?

మంగళవారం, 27 జూన్ 2023 (17:36 IST)
మధుమేహ వ్యాధిగ్రస్తులు తినడానికి ఉత్తమమైన గింజధాన్యాలలో పిస్తా పప్పు ఒకటి. షుగర్ వ్యాధిగ్రస్తులకు పిస్తా ఎలాంటి ప్రయోజనాలను చేకూర్చుతాయో తెలుసుకుందాము. పిస్తాపప్పులు సాధారణంగా ఆకలిని అరికడతాయి, ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉండేలా చేస్తాయి. పిస్తాలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రొటీన్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి.
 
 
రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా నిరోధించడంలో ఇవి ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. పిస్తాలో కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. రక్తంలో చక్కెర స్థాయిలపై పెద్దగా ప్రభావం చూపదు. పిస్తా మధుమేహాన్ని నిరోధించగల గింజ రకంగా పరిగణించబడుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు రోజుకు 50 గ్రాముల వరకు పిస్తాపప్పులను తీసుకోవచ్చు. అదే సమయంలో మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉప్పు కలిపిన పిస్తా తినకూడదు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు