'ము..ము.. ముద్దంటే చేదా.. నీకా ఉద్దేశం లేదా?' అంటూ ఏ సినీ కవి అన్నాడో. కానీ ఇప్పుడు ముద్దు నిజంగా చేదేనట. ధూమపానం, మందుతాగడం కంటే ముద్దు ఆరోగ్యానికి ఎంతో హాని చేస్తుందని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా ఫ్రెంచ్ ముద్దుతో హ్యూమన్ పాపిలోమా వైరస్ (హెచ్‌పీవీ) అనేది త్వరగా వ్యాప్తి చెందుతుందట! ఈ వైరస్ వేగవంతంగా సోకడం వల్ల తల, మెడ క్యాన్సర్‌లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని వైద్యులు అంటున్నారు,
ఈ ముద్దుతో 70 శాతం వైరస్ యాక్టివ్ అవుతుందట. ఒకటి కాదు.. రెండు కాదు.. దాదాపు 250 రెట్లు అధికంగా ఈ క్యాన్సర్ బారిన పడతారని నిపుణులు అంటున్నారు. ఈ వైరస్‌కి మగ, ఆడా అనే తేడా లేదట. అందరిలోనూ ఒకే విధంగా సోకుతుందట. ము…ము…ముద్దంటే చేదా? ఆ ఉద్దేశం లేదా? అని ఎవరైనా కవ్వించి పిలిస్తే కాస్త ఆలోచించండి మరి.