ఫ్రైడ్ ఫుడ్ సైడ్ ఎఫెక్ట్స్

మంగళవారం, 4 ఏప్రియల్ 2023 (19:43 IST)
ఫ్రైడ్ ఫుడ్. ఆహారాన్ని బాగా వేయించడం వల్ల మనం తీసుకునే కేలరీల సంఖ్య పెరుగుతుంది. కొన్ని రకాల నూనెలతో వేయించడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుంది. అవి ఎలాంటి అనారోగ్య సమస్యలకు దారి తీస్తాయో తెలుసుకుందాము. ఆహారాన్ని నూనెలో బాగా వేయించినప్పుడు అది నీటిని కోల్పోయి కొవ్వును గ్రహిస్తుంది, ఇది వాటి క్యాలరీ కంటెంట్‌ను మరింత పెంచుతుంది.
 
వేయించిన ఆహారాలలో సాధారణంగా ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి కనుక ఆరోగ్యానికి మంచిది కాదు. వేయించిన ఆహారాన్ని తినడం వల్ల వ్యాధి ప్రమాదాన్ని పెంచుతుంది. వేయించిన ఆహారాన్ని తినడం వల్ల అధిక రక్తపోటు, తక్కువ మంచి కొలెస్ట్రాల్, ఊబకాయం వంటివి గుండె జబ్బులకు దారి తీయవచ్చు.
 
వేయించిన ఆహారాన్ని తినడం వల్ల టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని అనేక అధ్యయనాలు కనుగొన్నాయి. వేయించిన ఆహారాలలో హానికరమైన యాక్రిలామైడ్ ఉండవచ్చు కనుక వాటికి దూరంగా వుండటం మంచిది.
 
గమనిక: అవగాహన కోసం ఈ సమాచారం ఇవ్వబడింది. మరింత సమాచారానికి వైద్య నిపుణులను సంప్రదించాలి.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు