కిడ్నీలో రాళ్లను కలిగించే ఆహారాలు ఏమిటి?

మంగళవారం, 28 ఫిబ్రవరి 2023 (16:49 IST)
కొంతమంది వ్యక్తులలో కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి క్రింది ఆహారాలు దారితీస్తాయి. కనుక వాటిని దూరంగా పెట్టుకోవాలి. లేదంటే చేజేతులా మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడటానికి ఈ పదార్థాలు కారణమవుతాయి. అవేమిటో తెలుసుకుందాము. బాగా డీప్‌గా వేయించిన చికెన్, ఉప్పుతో వేయించిన గింజలు వంటి సోడియం అధికంగా ఉండే ఆహారాలు.
 
కూల్ డ్రింక్స్. కోలా పానీయాలు కోలా గింజ యొక్క సారాన్ని కలిగి ఉన్న కార్బోనేటేడ్ శీతల పానీయాలు. పిజ్జాలు, బర్గర్లు, శాండ్ విచ్‌లు వగైరా ఫాస్ట్ ఫుడ్స్. ప్రాసెస్ చేసిన మాంసాలు అంటే ఉప్పుతోనో లేదంటే రసాయనాలను జోడించడం ద్వారానో తయారుకాబడిన మాంసాహారం.
పొటాషియం, విటమిన్ B-6, విటమిన్ D, కాల్షియం, చేప నూనెలు వంటి సప్లిమెంట్లు
బ్లాక్ టీలు అధిక మొత్తంలో ఆక్సలేట్ కంటెంట్‌ను కలిగి ఉంటాయి, ఇవి కిడ్నీ స్టోన్స్ ప్రమాదాన్ని మరింత పెంచుతాయి.
 
బాదం, జీడిపప్పులు మోతాదుకి మంచి తింటే కిడ్నీస్టోన్స్ వచ్చే అవకాశం వుంటుంది.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు