ప్లాస్టిక్ వస్తువులు వాడుతున్నారా.. జాగ్రత్త..?

గురువారం, 31 జనవరి 2019 (11:25 IST)
ఆఫీసులకు వెళ్తున్నారా.. ప్లాస్టిక్ వస్తువుల్ని లంచ్ బాక్సులుగా ఉపయోగిస్తున్నారా.. అయితే కచ్చితంగా జుట్టు వూడిపోతుందని హెయిర్ కేర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. రోజూ కార్యాలయాలకు ప్లాస్టిక్ డబ్బాల్లో ఆహారం నింపుకెళ్లే వారికి ఈ సమస్య తప్పదని నిపుణులు గుర్తించారు. స్కూళ్లకు వెళ్లే పిల్లలకు ప్లాస్టిక్‌ బాక్సుల్లో ఆహారాన్ని పెట్టి పంపడం ద్వారా చిన్న వయస్సులోనే పలు అనారోగ్య సమస్యలకు గురవుతున్నారని అధ్యయనంలో తేలింది. 
 
ఇప్పటి కాలంలో ప్లాస్టిక్ వస్తువులు తగ్గించేశారు. వీటి కారణంగా రకరకాల అనారోగ్య సమస్యలతో బాధపడవలసి వస్తుందని వాటిని పూర్తిగా ఉపయోగించడం మానేచారు. ప్లాస్టిక్ అంటేనే అందులో కెమికల్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ కెమికల్స్ శరీరంలో చేరినప్పుడు బాగానే ఉంటుంది. కానీ, కొన్ని రోజుల తరువాత సమస్య తీవ్రంగా మారి అనారోగ్యాల పాలయ్యేలా చేస్తుంది. కనుక వీలైనంత వరకు ప్లాస్టిక్ వస్తువుల వాడడం తగ్గిస్తే చాలు.
 
ప్లాస్టిక్‌ కప్పుల వాడకం వల్ల క్యాన్సర్‌ కారకాలు వ్యాపిస్తున్నట్లు అధ్యయనంలో వెల్లడైంది. అమెరికన్ పరిశోధనలో ప్లాస్టిక్ లోని కెమికల్స్ బ్రెస్ట్ క్యాన్సర్‌కు కారణమవుతుంది. ఇంకా చెప్పాలంటే.. స్పెర్మ్ కౌంట్‌ను కూడా తగ్గిస్తుంది. పిల్లలు, గర్భిణీ మహిళల్లో ఈ రిస్క్ ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు అంటున్నారు. అందువలన స్టెయిన్ లెస్ స్టీల్ కంటైనర్లు ఉపయోగిస్తే అనారోగ్య సమస్యలను దూరం చేస్తాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు