రాగుల జావ తీసుకుంటే ఆ శక్తి వస్తుంది..

బుధవారం, 30 జనవరి 2019 (18:01 IST)
రాగులు కూడ గింజ ధాన్యాలతో ఒకటిగా చెప్పవచ్చు. రాగులు చిన్నగా గుండ్రంగా ఉంటాయి. ఇతర ధాన్యాల కంటి రాగులు బలవర్థకమైనవి. శారీరక కష్టం అధికంగా చేసేవారు రాగుల పిండితో తయారుచేసిన పదార్థాలను తరచుగా తిన్నట్లయితే వారికి నూతన శక్తి లభిస్తుంది. రాగులలో అయోడిన్ పుష్కలంగా లభిస్తుంది. ఎదిగే పిల్లలకు పాలల్లో రాగులను వేయించి పొడిచేసిన పిండిని కలిపి తాగించినట్లయితే వారి ఎదుగుదల, ఆరోగ్యం బాగుండి శక్తి లభిస్తుంది.
 
రాగులలో క్యాల్షియం పిల్లలకు సక్రమ ఎదుగుదలకు తోడ్పడుతుంది. అమిత పుష్టిని కలిగిస్తుంది. జుట్టు ఒత్తుగానూ, పొడుగ్గానూ పెరుగుతుంది. మధుమేహ వ్యాధికి రాగులతో చేసిన ఆహార పదార్థాలు, రాగుల గంజి, పాలల్లో కలిపిన పానీయం చక్కని ఔషధంగా పనిచేస్తుంది. కడుపులో మంటను తగ్గించి, చలువ చేస్తుంది. పైత్యాన్ని తగ్గిస్తుంది. 
 
రాగుల పానీయం దప్పికను అరికడుతుంది. వృద్ధాప్యంలో ఉన్నవారు రాగులతో తయారుచేసిన ఆహార పదార్థాలను భుజించడం వలన శరీరానికి బలం, శక్తి చేకూరుతాయి. రాగులతో తయారుచేసిన రాగి మాల్ట్‌ను తాగినట్లయితే, ఎముకల పటుత్వానికి, థాతువుల నిర్మాణానికి తోడ్పడుతుంది. మూత్రపిండాలలో రాళ్ళు ఏర్పడకుండా చేస్తుంది. సుగంధిపాలు కలిపిన మాల్టును తీసుకుంటే రక్తపోటు అరికట్టబడుతుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు