ఖాళీ కడుపుతో ఉదయాన్నే ఇవి తినకూడదు

శుక్రవారం, 25 ఫిబ్రవరి 2022 (23:59 IST)
చాలామంది ఉదయం లేవగానే పళ్లు తోమేసి పరగడుపున తినకూడని పదార్థాలు తినేస్తుంటారు. దీనితో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. కొందరు పరగడుపున అరటి పండ్లు తింటారు. పరగడపున అరటిపండ్లు తీసుకోవడం వల్ల శరీరంలో ఉండే మెగ్నీషియం స్థాయి అధికమవుతుంది. ఇది ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం.

 
టమోటాలు తింటే వాటిలో ఉండే యాసిడ్స్ ఖాళీ కడుపులో చేరి వికారం కలిగించడమే కాకుండా ప్రేగుల్లో మంట పుట్టిస్తుంది. స్పైసీ ఫుడ్స్ ఉదయాన్నే తీసుకుంటే అల్సర్ వచ్చే అవకాశాలున్నాయని చెప్తున్నారు నిపుణులు. 

 
ఉదయం లేవగానే.. సోడా, కూల్‌డ్రింక్స్‌ను తాగడం వల్ల ప్రేగుల్లో మంట కలిగి వాంతులు, వికారం వంటి అనారోగ్య సమస్యలు ఏర్పడే ప్రమాదముందని నిపుణులు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు