వీర్యలోపం, లైంగిక సమస్యలను దూరం చేసుకోవాలంటే..యాలకులను ఆహారంలో చేర్చుకోవాలి. కంప్యూటర్ల ముందు గంటలపాటు కూర్చోవడం, వ్యాయామానికి దూరంగా వుండటం ద్వారా లైంగిక పరమైన ఇబ్బందులు తప్పట్లేదు. మారుతున్న ఆహారపు అలవాట్లు కూడా సంతానోత్పత్తిపై ప్రభావం చూపుతోంది. అందుకే సంతానోత్పత్తికి మనం చేయాల్సిందల్లా.. పోషకాహారం తీసుకోవడమే.
ముఖ్యంగా యాలకులను సినియోల్ రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇది ప్రైవేట్ భాగాలకు రక్త ప్రసరణను వేగవంతం చేస్తుంది. యాలకులను టీలోనూ లేదా వేడి నీటిలో మరిగించి తీసుకోవడం ద్వారా వీర్య లోపాలు, లైంగిక సమస్యలు దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.