Madalsa Sharma: మదాలస శర్మ కాస్టింగ్ కౌచ్ కామెంట్లు.. కెరీర్‌ ప్రారంభంలోనే?

సెల్వి

శుక్రవారం, 31 అక్టోబరు 2025 (16:18 IST)
Madalsa Sharma
సౌత్ ఇండస్ట్రీ గురించి మదాలస శర్మ షాకింగ్ కామెంట్స్ చేసింది. 2009లో ఫిట్టింగ్ మాస్టర్‌తో అరంగేట్రం చేసింది. ఇటీవల జరిగిన పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో, మదాలస శర్మ తన కెరీర్ ప్రయాణం గురించి, పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్‌తో తన అనుభవాల గురించి స్పష్టంగా మాట్లాడారు.
 
తన కెరీర్ ప్రారంభంలో కొన్ని అసహ్యకరమైన పరిస్థితులను ఎదుర్కొన్నానని, వాటిని ఎదుర్కోవడం తనకు కష్టమనిపించిందని, చివరికి ఆ మార్గంలో కొనసాగకూడదని నిర్ణయించుకున్నానని ఆమె వెల్లడించింది. దీనికోసం దక్షిణ భారత చిత్రాలకు దూరంగా ఉంది.
 
ప్రతి మనిషికి ఒక లక్ష్యం ఉంటుందని.. దాన్ని చేరుకోవాలని అనుకుంటారు. తనకు కూడా ఒక లక్ష్యం, ఆశయం ఉన్నాయని తెలిపింది. కానీ వాటిని తనపై ఆధిపత్యం చెలాయించనివ్వను. తాను ప్రశాంతగా ఉండాలి అనుకుంటాను… ఏం కావాలో, ఏమి వద్దో తనకు తెలుసు. ప్రతిదానికీ ఒక వెల ఉంటుంది.. తన నిర్ణయాలు ఎప్పుడూ ఈ ఆలోచన ఆధారంగానే తీసుకుంటానని మదాలస తెలిపింది.  
 
మదాలస శర్మ 2009లో తెలుగులో ఫిట్టింగ్ మాస్టర్ సినిమాతో అరంగేట్రం చేసింది. ఆ తర్వాత శౌర్య, డోవ్, సూపర్ 2 వంటి అనేక సినిమాల్లో నటించింది. వీటితో పాటు కొన్ని బాలీవుడ్ సినిమాల్లో కూడా పనిచేసింది. కానీ ఆమెకు అసలైన గుర్తింపు అనుపమ టీవీ షోతో వచ్చింది. మదాలస 2018లో మిథున్ చక్రవర్తి కొడుకు మహాఅక్షయ్ చక్రవర్తిని పెళ్లి చేసుకుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు