కరోనా వైరస్ కారణంగా ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. రోజుకో ఆపిల్ తింటే వ్యాధినిరోధక శక్తిని పెంచుకోవచ్చు. యాంటి ఆక్సిడెంట్స్ అధికంగా కలిగి ఉన్న యాపిల్ మనకు పలురకాల క్యాన్సర్‌ల నుంచి రక్షణ ఇస్తుంది. యాపిల్ ఏజింగ్ ప్రాసెస్ నుంచి రక్షిస్తుంది. మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. హృద్రోగాలను నివారిస్తుంది.
మోనోపాజ్ దశలో మహిళలో సంభవించే ఎముకలకు సంబంధించిన ఇబ్బందుల్ని ఆపిల్ తొలగిస్తుంది. టైప్-2 డయాబెటిక్‌తో బాధపడే వారు ఉదయం, రాత్రి.. అరకప్పు యాపిల్ తింటే మంచి ఫలితం వుంటుంది. ఆస్తమాతో బాధపడేవారు విడవకుండా రోజూ ఓ యాపిల్ తింటే వ్యాధి నియంత్రణలో ఉంటుంది.