అరటి పువ్వు జ్యూస్‌‌తో దగ్గు పరార్

శుక్రవారం, 22 నవంబరు 2019 (14:58 IST)
అరటి పండ్లలోనే కాదు.. అరటి పువ్వులోనూ ఔషధ గుణాలు పుష్కలంగా వున్నాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మహిళలకు అరటిపువ్వు ఎంతో మేలు చేస్తుంది. మధుమేహంతో బాధపడే వారు అరటి పువ్వును శుభ్రం చేసుకుని సన్నగా తరిగి.. చిన్న ఉల్లి, వెల్లుల్లి, మిరియాలు చేర్చి వేపుడులా తయారు చేసి తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది. 
 
ఇంకా అరటిపువ్వు శరీరంలో ఇన్సులిన్ స్థాయుల్ని పెంచుతుంది. తద్వారా డయాబెటిస్‌ను నియంత్రించవచ్చు. వారానికి రెండుసార్లు అరటి పువ్వును పెసళ్లతో కలిపి కూర చేసుకుని తీసుకోవడం ద్వారా శరీర ఉష్ణోగ్రత క్రమంగా వుంటుంది. అజీర్తి సమస్యలను దూరం చేసుకోవాలనుకునేవారు.. అరటిపువ్వును వారంలో రెండు సార్లు డైట్‌లో చేర్చుకోవాలి.
 
నెలసరి సమస్యలు, అధిక రక్తస్రావం వంటి సమస్యలను ఎదుర్కొనే మహిళలు అరటిపువ్వు వంటకాలను తీసుకోవాలి. తెల్లబట్ట ఇబ్బందులను కూడా ఇది తొలగిస్తుంది. కీళ్ల నొప్పులకు అరటిపువ్వు దివ్యౌషధంగా పనిచేస్తుంది. వర్షాకాలంలో వేధించే జలుబు, దగ్గుకు అరటిపువ్వు జ్యూస్ ఉపశమనాన్ని ఇస్తుంది. అరటిపువ్వు రసాన్ని మిరియాల పొడితో కలిపి తీసుకుంటే.. దగ్గు తగ్గిపోతుంది. జలుబు మాయమవుతుందని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు