బార్లీ జావను పరగడుపున తాగితే.. బరువు తగ్గుతారు..

బుధవారం, 8 నవంబరు 2017 (12:55 IST)
బార్లీ జావను పరగడుపున తాగడం ద్వారా బరువు తగ్గుతారు. బార్లీని గుప్పెడు తీసుకుని అందులో ఒక లీటర్ నీటిని పోయాలి. ఆ నీటిని 20 నిమిషాల పాటు మరిగించాలి. దీంతో బార్లీ గింజలు మెత్తగా మారిపోతాయి. వాటిలోని పోషకాలన్నీ ఆ నీటిలోకి చేరుచాయి. అనంతరం ఆ నీటిని చల్లార్చి.. కొద్దిగా నిమ్మరసం కలిపి ఒక టీ స్పూన్ తేనెను కలుపుకుని రోజూ తాగితే అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. 
 
ఇంకా కోలన్ క్యాన్సర్‌ను దూరం చేసుకోవచ్చు. కీళ్ల, మోకాళ్ల నొప్పులను తగ్గిస్తాయి. మధుమేహాన్ని నియంత్రిస్తాయి. శరీరంలో వున్న చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. దీంతో గుండె సంబంధిత సమస్యలు రాకుండా వుంటాయి. గర్భవతులు బార్లీనీటిని తాగితే మూత్రాశయ సంబంధ సమస్యలు తొలగిపోతాయి. 
 
బరువు తగ్గాలనుకునేవారికి బార్లీ నీరు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే పోషకాలు శరీర మెటబాలిజాన్ని క్రమబద్ధీకరిస్తాయి. దీంతో బరువు తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు