ఉదయం పూట పెరుగు తీసుకుంటే..? బార్లీతో కిచిడి చేసుకోవచ్చు..

సోమవారం, 5 డిశెంబరు 2016 (16:53 IST)
అల్పాహారంలో కోడిగుడ్డును తీసుకోవడం ద్వారా బరువు తగ్గవచ్చు. దీనిలోని మాంసకృత్తులు శక్తిని అందిస్తాయి. సన్నబడటానికి కారణమవుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. పెరుగులోని ప్రోబయోటిక్స్ అందించే వాటిలో పెరుగు ఒకటి. గ్లాసు పెరుగులో కాసిని నీళ్లు పోసి కాసేపు గిలకొట్టాక తీసుకోవాలి. ఉదయం పూట పెరుగు తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ మీద ప్రభావం పడుతుంది. వ్యాధులు దూరమవుతాయి. బరువు కూడా తగ్గుతారు.
 
అటుకుల్ని ఉదయం పూట అల్పాహారంగా తీసుకోవడం వల్ల తేలిగ్గా జీర్ణం అవుతాయి. కళ్లకు కూడా వీటిలోని పోషకాలు మేలు చేస్తాయి. జీర్ణ వ్యవస్థకూ మేలు జరుగుతుంది. పప్పులూ లేదంటే బార్లీతో కిచిడిని చేసుకోవచ్చు. తక్కువ మసాలా వేయాలి. వీటిలో వేసే ప్రతి పదార్థం ఆరోగ్యానికి మేలు చేసేది. దీన్ని కొద్దిగా తీసుకున్నా త్వరగా పొట్ట నిండినట్లుగా అనిపిస్తుంది. బరువు పెరుగుతారన్న భయం కూడా ఉండదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి