షార్ట్ ఫిలింస్ స్థాయి నుంచి హీరోగా తనకొక స్థాయి సంపాదించుకునే వరకు ఎదిగారు కిరణ్ అబ్బవరం. ఈ క్రమంలో ఫిలింమేకింగ్ లో ఆయన ఎన్నో ఇబ్బందులు, కష్టాలు చూశారు. ఎవరి సపోర్ట్ లేకుండా గుర్తింపు తెచ్చుకున్నారు. స్ట్రాంగ్ కంటెంట్, ఇన్నోవేటివ్ మేకింగ్ తో మూవీస్ చేస్తున్నారు. ఒక్క ఛాన్స్ కష్టాలు తెలిసిన హీరో కాబట్టే తనలా ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకోవాలని ఆశపడే ఔత్సాహిక నటీనటుల, సాంకేతిక నిపుణులకు అండగా నిలుస్తానని దిల్ రూబా సినిమా ఈవెంట్స్ లో చెప్పారు కిరణ్ అబ్బవరం. చెప్పినట్లే తన మాట మీద నిలబడుతూ కొత్త వాళ్లతో తన సొంత బ్యానర్ పై మూవీ ప్రొడ్యూస్ చేస్తున్నారాయన.