బీట్‌రూట్ అలాంటి వారు ఎట్టి పరిస్థితుల్లో తినకూడదు...

శుక్రవారం, 8 జూన్ 2018 (11:14 IST)
బీట్‌రూట్‌ను ఎంత తింటే శరీరానికి అంత రక్తాన్ని పట్టిస్తుంది. బీట్‌రూట్‌లో మెగ్నిషియం, బయో ప్లేవనాయిడ్‌లు ఉంటాయి. శరీరంలో ట్రై గ్లిసరేడ్‌ల శాతం తగ్గించడానికి బీట్‌రూట్ చాలా ఉపయోగపడుతుంది. ఇది రక్తంలోని కొవ్వును కూడా తగ్గిస్తుంది. హార్మోన్ల ఉత్పత్తి కూడా బీట్‌రూట్ సహకరిస్తుంది. ఇన్ని సుగుణాలు ఉన్న బీట్‌రూట్లో కొన్ని ప్రమాదాలు కూడా ఉన్నాయట. అవెంటో తెలుసుకుందాం.

ఏ అనారోగ్యానికి గురికాకుండ ఉన్నవారు బీట్‌రూట్‌ను తీసుకుంటే మంచిది. ఎక్కువగా మందులు వాడేవారు మాత్రం బీట్‌రూట్ తీసుకోకూడదు. కాబట్టి జాగ్రత ఉంటే మంచిది.
 
హెమో క్రొమోటోసిస్, వీసర్ వ్యాధితో బాధపడేవారు బీట్‌‌‌‌‌‌రూట్‌ను అతిగా తినరాదు. దీనివల్ల శరీరంలో ఎక్కువ స్థాయిలో కాపర్, ఐరన్ నిల్వలు చేరుతాయి. శరీరంలో ఐరన్ నిల్వగా ఉండే వ్యాధినే హెమే క్రొమోటోసిస్ వ్యాధి అంటారు. అంతేకాకుండా మూత్రం ఎర్రగా రావడం, రక్తం ఎక్కువగా ఎర్రబడటం జరుగుతుంది. రక్తం ఎర్రబడితే సమస్యలు లేవు కానీ దీనివల్ల ఎన్నో రకాల సైడ్ ఎఫెక్ట్ ఉంటాయని వైద్య నిపుణులు తెలియజేశారు.
 
బీట్‌రూట్ వలన కొంతమందిలో వికారంతో పాటు డయేరియా వ్యాధి వచ్చే అవకాశం ఉంది. గర్భిణీ స్త్రీలు అస్సలు బీట్‌రూట్ తినకూడదు. అధిక రక్తపోటు ఉన్నవారికి బీట్‌రూట్ మంచిదే. కానీ రక్తపోటుకు మందులు వాడే వారు బీట్‌రూట్‌ను తక్కువగా తీసుకుంటే మంచిది. ఎక్కువగా తీసుకోవడం వలన ఇబ్బందులు తప్పవు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు