బెల్లం టీ తాగండి.. పొట్ట చుట్టూ కొవ్వును ఇట్టే కరిగించుకోండి..

సెల్వి

గురువారం, 23 మే 2024 (18:14 IST)
Jaggery Tea
లెమన్ టీ, గ్రీన్ టీల వలె బెల్లం టీ తీసుకుంటే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి. బెల్లంలో పోషకాలు మెండు. మెగ్నీషియం, బి కాంప్లెక్స్, విటమిన్ సి, కాల్షియం, పొటాషియం, విటమిన్ ఇ, విటమిన్ బి2 లాంటివి ఉంటాయి.
 
బెల్లం టీ తీసుకోవడంవల్ల ఆహారం వెంటనే జీర్ణమవుతుంది. ఇలా అవడం వల్ల పొట్టలో కొవ్వు పేరుకుపోదు. పొట్టచుట్టూ కొవ్వు చేరకుండా ఇది సహాయపడుతుంది. ఐరన్ లోపం ఉంటే రక్తహీనత తలెత్తుంది. దీంతో బరువు పెరిగే ప్రమాదం వుంది. 
 
బరువు పెరగకుండా వుండాలంటే.. రోజూ ఓ కప్పు బెల్లం టీని తీసుకుంటే సరిపోతుంది. పొటాషియం మెండుగా ఉండే బెల్లం ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడుతుంది. కండరాలను నిర్మించడానికి, జీవక్రియను పెంచడానికి పొటాషియం తోడ్పడుతుంది. అధిక బరువును ఇది కరిగిస్తుంది.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు