డైనింగ్ టేబుల్ వద్దు.. నేలపై కూర్చుని భోజనం చేస్తే..?
శుక్రవారం, 7 జులై 2023 (11:13 IST)
Eating
పూర్వకాలంలో అందరూ ఒకేసారి కూర్చుని భోజనం చేస్తుండేవారు. ప్రస్తుతం వారివారికి ఆకలేస్తే కూర్చుని తినడం పోవడం చేస్తున్నారు. కుటుంబంతో అందరూ కలిసి తినడం ప్రస్తుతం బాగా కరువైందనే చెప్పాలి. పూర్వం డైనింగ్ టేబుల్స్ లేవు.
కానీ నేటి నాగరికతలో డైనింగ్ టేబుల్ వద్ద కూర్చొని భోజనం చేయడం ఆనవాయితీగా మారింది. అయితే నేల మీద కూర్చుని తినడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.
చాప పరిచి దానికి పై కూర్చుని ముందు విస్తరిలో వున్న ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. అంతేగాకుండా డైనింగ్ టేబుల్ మీద కూర్చుని కాళ్లు ఊపుతూ తినడం వల్ల అనేక శారీరక రుగ్మతలు వస్తున్నాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.
కాళ్లు కిందికి వేలాడుతూ వుంటూ భోజనం చేస్తే నడుము కింది భాగంలో మాత్రమే శరీరంలో రక్తప్రసరణ ఎక్కువగా ఉంటుంది. కానీ కాళ్లు ముడుచుకుని నేలపై కూర్చొని తింటే శరీరమంతా రక్తప్రసరణ ఏకరీతిగా సాగుతుంది.
అందుకే తిన్నప్పుడు రక్తప్రసరణ సాఫీగా సాగితేనే తిన్న ఆహారం తేలికగా జీర్ణమవుతుందన్నారు. కాబట్టి కూర్చొని కాళ్లు ముడుచుకుని తినాలని పూర్వీకుల సలహా. వీలైనంత వరకు నేలపై కూర్చుని తినడం మంచిది.
కింద కాకుండా టేబుల్ భోజనం వల్ల పొట్ట మీద ఒత్తిడి పడకుండా సౌకర్యవంతంగా ఉంటుంది భోజనం. అయితే అసలు కింద కూర్చుని భోజనం చేయడం వల్ల పొట్టమీద ఒత్తిడి పడి కండరాల్లో కదలికలకు కారణం అవుతుంది. ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.
నేల మీద కూర్చోవడం వల్ల గుండెకు రక్తప్రసరణ బాగా జరుగుతుంది. ఇది వెన్ను సమస్యలు, గ్యాస్ సమస్యలను దూరం చేస్తుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.