టమోటా వల్ల కలిగే ప్రయోజనాలు.. (video)

గురువారం, 5 సెప్టెంబరు 2019 (13:47 IST)
టమోటాలో న్యూట్రిషియన్ ఫాక్ట్స్ అధికంగా ఉన్నాయి. టమోటా లేని వంటకం అంటూ ఉండదు. టమోటాను కూర రూపంలో తీసుకోవడం కంటే పచ్చిగా తీసుకుంటే మంచిదని చెప్తున్నారు వైద్యులు. టమోటా తరువాత.. మార్కెట్లో అధికంగా దొరికేవి.. బంగాళాదుంపలు, పాలకూర, ఉల్లిపాయలు. మరి టమోటా తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం..
 
1. టమోటాను డైట్‌లో చేర్చుకుంటే.. క్యాన్సర్, రక్తపోటు, మధుమేహం వంటి వ్యాధులను అడ్డుకుంటుంది. చాలామంది చిన్నవయస్సులోనే కంటి చూపును కోల్పోతుంటారు. అలాంటి వారు ప్రతిరోజూ ఒక్క పచ్చి టమోటాను తింటే.. చూపు బాగా కనబడుతుంది.
 
2. టామోటా రంగును చూస్తేనే దానిని తినాలనిపిస్తుంది. కూరగాయలన్నింటి కంటే టమోటా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కనుక ఏ కూరగాయను తీసుకున్నా ముందుగా వాటిని శుభ్రం చేసి తీసుకోవాలని చెప్తున్నారు. ఒక్క టమోటా తీసుకుంటే 10 రకాల కూరగాయలు తిన్నట్టవుతుంది.
 
3. టమోటాలో బీటా కెరోటిన్ అధిక మోతాదులో ఉంటుంది. ఈ టమోటాను తీసుకుంటే.. శరీరానికి కావలసిన ఎనర్జీ అందుతుంది. దాంతో చర్మం, జుట్టు, అధిక బరువు సమస్య కూడా రాదు. ఈ టమోటాలు ఒబిసిటీని తగ్గిస్తాయి. 
 
4. టమోటాలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ ఖనిజాలు అధికం. ఇవి క్యాన్సర్ వ్యాధి నుండి ఉపశమనం కలిగేలా చేస్తాయి. టమోటా తీసుకుంటే.. 80 శాతం శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ పోతుంది.
 
5. చాలామందికి గుండె వ్యాధుల కారణంగా రక్తపోటు వస్తూ ఉంటుంది. అందుకు ఏం చేయాలంటే.. టమోటాలు తీసుకోవాలి. టమోటాలోని పొటాషియం రక్తపోటు వ్యాధికి ఎంతో పనిచేస్తాయి. 
 
6. టమోటాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు నూనెలో కొన్ని ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, టమోటాలు వేసి బాగా వేయించుకోవాలి. ఈ మిశ్రమాన్ని వేడివేడి అన్నంలో కలిపి తీసుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది. దీనిని తీసుకుంటే.. హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది.   

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు