వేసవిలో వచ్చిందంటే చాలు కొంతమంది ఏది పడితే అది ఆరగిస్తుంటారు. వేసవిలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి, వేటిని తీసుకోకూడదని తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. వేసవిలో ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. వేసవిలో శరీరంలో నీటి శాతాన్ని సక్రమంగా ఉంచుకోవాలి.
అయితే నీటిని మాత్రమే తాగడంతో శరీరంలోని నీటి శాతాన్ని సరైన స్థాయిలో ఉంచుకోవడం కుదరదు. అందుచేత నీటిశాతం అధికంగా ఉన్న కూరగాయలను తీసుకోవడం చాలా మంచిది. వేసవిలో సూప్ వెరైటీలు, పండ్ల రసాలు, నీరు, మజ్జిగ పదార్థాలను ఎక్కువగా తీసుకుంటుండాలి. ఇలా తీసుకోవడం వల్ల శరీరానికి కావలసిన శక్తి లభిస్తుంది.
ఇక వేసవిలో శుభ్రమైన నీటిని సేవించాలి. ముఖ్యంగా కూల్‌డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్‌ను సేవించడాన్ని చాలా మటుకు తగ్గించాలి. కాకర, వంకాయ వంటివి వేసవిలో తీసుకోకపోవడం మంచిది ఎందుకంటే వేసవిలో ఇవి అంత త్వరగా జీర్ణంకావు.