తమలపాకులను తొడిమలతో తింటున్నారా?

సోమవారం, 11 డిశెంబరు 2017 (09:35 IST)
తమలపాకులను తొడిమలతో తింటే మహిళల్లో వంధ్యత్వం వస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. యవ్వనంగా వుండాలంటే.. ప్రతిరోజు తొడిమలు తీసేసిన తమలపాకును రోజుకొకటి తీసుకోవడం ద్వారా ముఖం మీద ముడతలు పోతాయని వారు చెప్తున్నారు. ముఖంపై ముడతలు తగ్గించుకునేందుకు అనేక కాస్మొటిక్స్ వాడుతుంటారు. 
 
వీటిలోని రసాయనాలతో చర్మానికి ఇబ్బంది మిగులుతుంది. అందుకే రోజుకో తమలపాకును నమిలితే అందానికి అందం.. ఆరోగ్యానికి ఆరోగ్యం చేకూరుతుంది. తమలపాకుల్లో యాంటీ యాక్సిడెంట్లు ఎక్కువగా వుండటంతో వృద్ధాప్య ఛాయలను దూరం చేసుకోవచ్చు. 
 
అలాగే శరీరానికి తాంబూల సేవనం చాలా ఉపయోగకరమైనది. ఎముకలకు మేలు చేసే క్యాల్షియం, ఫోలిక్ యాసిడ్, ఎ విటమిన్, సి విటమిన్‌లు తమలపాకులో పుష్కలంగా వున్నాయి. తాంబూలం రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ప్రతిరోజూ రెండు నెలలపాటు ఒక తమలపాకును పది గ్రాముల మిరియాల గింజలను కలిపి తిని వెంటనే చన్నీళ్లు తాగుతుంటే ఒబిసిటీ నుంచి విముక్తి కలుగుతుంది. 
 
తమలపాకు రసం, తులసి రసం, అల్లం రసం, మిరియాల పొడి, తేనెలను కలిపి పిల్లల నాలుకపై వుంచి చప్పరించేలా చేస్తే జలుబు, దగ్గు తగ్గుతాయి. తమలపాకును తింటే నోటి దుర్వాసన తగ్గుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు