అధిక రక్తపోటు కలిగినవారు తాంబూలాన్ని యధేచ్ఛగా వాడకూడదు.
తాంబూలాన్ని తయారుచేసేటప్పుడు సున్నం కలుపుతారు, ఈ పదార్థం రక్తనాళాల మీద, రక్తసరఫరామీద వ్యతిరేక ప్రభావం చూపుతుంది.
తమలపాకు, సున్నం, వక్క కాంబినేషన్‌తో చేసే తాంబూలం వల్ల ఉపయోగాలున్నాయి.
తాంబూలం వేసుకుంటే ఎముకలు గుల్లబారటం సమస్య రాకుండా ఉంటుంది.
తమలపాకు రసం, తులసి రసం, అల్లం రసం, మిరియాలు పొడి, తేనెలను కలిపి నాకిస్తే పిల్లల్లో జలుబు, దగ్గు తగ్గుతాయి.