నల్లటి ద్రాక్షలో సి-విటమిన్, విటమిన్-ఏ, బీ6, ఫోలిక్ ఆమ్లంకూడా వీటిలో పుష్కలంగా ఉన్నాయి. పొటాషియం, కాల్షియం, ఇనుము, ఫాస్పరస్, మెగ్నీషియం, సెలీనియంలాంటి ఎన్నోరకాల ఖనిజలవణాలు ద్రాక్షలో సమృద్ధిగా వున్నాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
ద్రాక్షలో ప్లేవనాయిడ్స్‌లాంటి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు వృద్ధాప్య ఛాయలను తొలగిస్తాయి. నిత్యయవ్వనులుగా వుంచుతుంది. అంతేకాకుండా నల్లటి ద్రాక్షలు రక్తంలో నైట్రిన్ ఆక్సైడ్ మోతాదును పెంచుతాయి, నైట్రిక్ ఆక్సైడ్ రక్తం గడ్డలుగా ఏర్పడకుండా నివారిస్తాయి, గుండెపోటు నివారణకు దోహదపడుతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.