వేసవిలో పనసపండును తీసుకుంటే?

శనివారం, 2 జూన్ 2018 (11:08 IST)
పనస పండు ఒక సంపూర్ణమైన, బలవర్ధకమైన ఆహారం. ఇందులో విటమిన్ ఎ, సి, బి6 తోపాటు థియామిన్, రిబోప్లానిన్, క్యాల్షియం, పొటాషియం, ఐరన్, సోడియం, జింక్, ఫైబర్ ఇవన్నీ ఈ పనస పండులో ఉండడం వలన ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్స్‌ను పుష్కలంగా కలిగిఉంటుంది.
 
అంతేకాకుండా ఇది ప్రేగు, లంగ్స్, క్యాన్సర్ వ్యాధుల కారకాలతో పోరాడి డిఎన్‌ఎను డ్యామేజ్ బారి నుండి కాపాడుతుంది. ఇందులో సోడియం అధిక రక్తపోటు సమస్యల తీవ్రతను తగ్గిస్తుంది. ఆస్తమా వంటి శ్వాసకోస వ్యాధుల నుండి కాపాడుతుంది. రక్తహీనత సమస్యలతో బాధపడేవారికి పనసపండు ఒక మంచి ఫలితాన్ని ఇస్తుంది.
 
పనసపండు రక్తంలోని చక్కెర స్థాయిలను క్రమబద్దీకరిస్తుంది. ఇందులో ఉండే విటమిన్ ఎ దృష్టిలోపాలను నివారించుటకు ఉపయోగపడుతుంది. కంటి చూపును మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా చర్మం, జుట్టు ఆరోగ్యంతో ఉండేలా సహాయపడుతుంది. ఇది శరీరంలోని ఎముకలను బలోపేతం చేస్తుంది. ఎముకలకు, కండరాలకు ఇది మంచి ఆరోగ్యాన్ని అందిస్తుంది. పనసలో ఉండే ఫైబర్ జీవక్రియలు సాఫీగా జరిగేలా తయారుచేస్తాయి. కడుపులో ఏర్పడే గ్యాస్, ఆల్సర్ వంటి జీర్ణసంబంధిత వ్యాధులు నివారిస్తుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు