ఇనుములాంటి దేహం కావాలంటే మినుములు తీసుకోండి..

మంగళవారం, 9 ఏప్రియల్ 2019 (17:29 IST)
మినుములు తింటే ఇనుము అంత బలం అని మన ఇంట్లో అంటుంటారు. వీటిలో ఉన్న పోషకాలు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయని, అలాగే రకరకాల జబ్బులను నివారిస్తాయని వైద్యులు అంటున్నారు. వంద గ్రాముల మినుముల్లో 18గ్రాముల పీచు(ఫైబర్) ఉంటుంది. 
 
ఒక గ్రాము పొటాషియం, రెండు గ్రాముల కొవ్వుతో పాటు విటమిన్ సీ, విటమిన్ బీ- కాంప్లెక్స్‌లోని బీ1,బీ3 వంటివి పుష్కలంగా ఉంటాయి. అలాగే కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్, ఐరన్ కూడా ఎక్కువే. మినుములలో మంటను తగ్గించే యాంటీ-ఇన్‌ప్లమేటరీ గుణం ఉంది. కాబట్టి గాయాలైన వారికి, అవి త్వరగా తగ్గేందుకు మినుములు మంచి ఆహారంగా అందిస్తారు. 
 
మినుముల్లో దాదాపు 72 శాతం ఫీచు ఉండటం వల్ల మన జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. జీర్ణ వ్యవస్థకు సంబంధించిన డయేరియా, డిసెంట్రీ వంటి సమస్యలు ఉన్న వారు కూడా మందులకు బదులు మినుములతో చేసిన వంటకాలను తినవచ్చని ఆహార నిపుణులు అంటున్నారు. గుండె జబ్బులను నివారించే అద్భుతమైన గుణం మినుములకు ఉంది. 
 
ఇందుకు మినుముల్లో పుష్కలంగా ఉన్న పొటాషియం, పీచుపదార్థాలే కారణం. అవి రక్తంలోకి వెలువడే చక్కెర, కొలెస్ట్రాల్ పాళ్లను గణనీయంగా తగ్గిస్తాయి. పొటాషియం వల్ల రక్తపోటు తగ్గుతుంది. 
 
కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగించే గుణం కూడా మినుములకు ఉంది. స్వాభావికమైన పీచుపదార్థం ఎక్కువగా ఉండటం వల్ల డయాబెటిస్ సమస్య ఉన్న వారికి మినుములు మంచి ఆహారం మినుములను ఏ కాలంలో అయినా తీసుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు