వేసవి కాలంలో ఎక్కువగా నీరు తాగాలనిపిస్తుంది. కొంత మందికి దాహం చాలా ఎక్కువగా ఉంటుంది. అతి దాహాన్ని నివారించే గుణాలు నేరేడు పండ్లలో ఉన్నాయి. ఎండా కాలంలో వేడి చేయకుండా ఉండాలంటే నేరేడు పండ్లను తింటే మంచిది. ఇవి శరీరానికి చలువచేస్తాయి. మూత్రాశయ రోగాలను నయం చేయడంలో ఇవి తోడ్పడతాయి. కిడ్నీల్లో రాళ్లు ఏర్పడకుండా చూస్తాయి.
నోటి దుర్వాసన దూరమవుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. నేరేడుపండ్లలో కాల్షియం, మెగ్నీషియం, పాస్ఫరస్, సోడియం, విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటాయి.
నేరేడు పండ్లను తింటే మధుమేహ వ్యాధి నియంత్రణలో ఉంటుంది, రక్తహీనత తగ్గుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. జీర్ణక్రియ మెరుగవ్వాలంటే కప్పు పెరుగులో నాలుగు చెంచాల నేరేడు పండ్ల రసం కలిపి తీసుకుంటే మంచి ఫలితం కనబడుతుంది.